TATA Power: ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయంగా టాటా పవర్‌

మనదేశంలోని ఉద్యోగులకు ‘అత్యంత ఆకర్షణీయ కంపెనీ బ్రాండ్‌’గా టాటా పవర్‌ కంపెనీ అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, టాటా స్టీల్‌ ఉన్నట్లు మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టడ్‌ ఇండియా తన ‘రాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ 2023’లో పేర్కొంది.

Updated : 22 Jun 2023 09:01 IST

తదుపరి స్థానాల్లో అమెజాన్‌, టాటా స్టీల్‌
రాండ్‌స్టడ్‌ ఇండియా వార్షిక నివేదిక

ముంబయి: మనదేశంలోని ఉద్యోగులకు ‘అత్యంత ఆకర్షణీయ కంపెనీ బ్రాండ్‌’గా టాటా పవర్‌ కంపెనీ అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, టాటా స్టీల్‌ ఉన్నట్లు మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టడ్‌ ఇండియా తన ‘రాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ 2023’లో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 75 శాతం వాటా కలిగిన 32 మార్కెట్లలోని 1.63 లక్షల మంది ఉద్యోగులను సర్వే చేసి, ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ తెలిపింది. దీని ప్రకారం మన దేశంలో..
* ఆర్థిక పరిస్థితి, మెరుగైన కీర్తిప్రతిష్ఠలు, వృత్తిజీవితంలో ఎదగడానికి అవకాశాల విషయంలో టాటా పవర్‌ అత్యధిక స్కోరు సాధించింది. 2022లో 9వ ర్యాంకులో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది అగ్రస్థానంలోకి వచ్చింది.
* అమెజాన్‌ ఇండియా కూడా ర్యాంకుల్లో రాణించి.. రెండో స్థానంలో నిలిచింది. టాటా స్టీల్‌, టీసీఎస్‌ వరుసగా 3, 4 స్థానాలను సంపాదించాయి.
* మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఐబీఎమ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తొలి 10 కంపెనీల్లో టాటా గ్రూప్‌నకు చెందినవే 4 ఉండటం గమనార్హం.
* ఆన్‌లైన్‌ మెగాస్టోర్‌ అయిన బిగ్‌ బాస్కెట్‌ అత్యంత ఆకర్షణీయ అంకుర బ్రాండ్‌గా అవతరించింది.

వాహన రంగాన్ని ఇష్టపడుతున్నారు

వాహన (77%) రంగం అత్యంత ఆకర్షణీయమైనదిగా ఉద్యోగులు రేటింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ, ఐటీఈఎస్‌, టెలికాం(76%), ఎఫ్‌ఎమ్‌సీజీ, రిటైల్‌,  ఇ-కామర్స్‌(75%) నిలిచాయి.

ఈ అంశాల ఆధారంగా

కంపెనీని ఎంచుకునేందుకు వృత్తి-జీవిత సమతౌల్యం, కీర్తిప్రతిష్ఠలు, ఆకర్షణీయ వేతనం-ప్రయోజనాలను భారతీయ ఉద్యోగులు పరిగణనలోకి తీసుకున్నారు. వీటిల్లో పని-జీవిత సమతౌల్యానికి మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
* అదనపు ఆదాయానికి ఇతరత్రా పనులు చేసుకోవడానికి అంగీకరించే కంపెనీలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయని 91% మంది ఉద్యోగులు చెప్పారు. నీ పెట్టుబడులు మాత్రమే వ్యాపార విజయానికి దోహదం చేయలేవని.. ఉద్యోగులే అందుకు కారణమవుతారని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తించాయి. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు తాము ఏ బ్రాండ్‌లో పనిచేయాలన్న దానిపై అత్యంత శ్రద్ధ పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని