ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభంలో 30% వృద్ధి

జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది.

Published : 28 Apr 2024 01:38 IST

ముంబయి: జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి ఇందుకు తోడ్పడింది. 2022-23 జనవరి- మార్చిలో నికర లాభం రూ.271 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.1,600 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 20 శాతం వృద్ధి ఇందుకు దోహదం చేసింది. అయితే నికర వడ్డీ మార్జిన్‌ 5.62 శాతం నుంచి 5.45 శాతానికి తగ్గడం వడ్డీ ఆదాయంలో వృద్ధిని కొంత మేర పరిమితం చేసింది. ఇతర ఆదాయం కూడా 30 శాతం పెరిగి రూ.875 కోట్లుగా నమోదైంది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ డిపాజిట్లలో 22 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టరు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ఆర్‌.సుబ్రమణియకుమార్‌ తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తులు 3.37 శాతం నుంచి 2.65 శాతానికి తగ్గాయి. అయితే కేటాయింపులు రూ.235 కోట్ల నుంచి రూ.414 కోట్లకు పెరగడం గమనార్హం. 2024 మార్చి చివరినాటికి బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 16.18 శాతంగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని