భారత్‌లో షార్ప్‌ సెమీ కండక్టర్ల యూనిట్‌

జపాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షార్ప్‌ దేశంలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.

Published : 28 Apr 2024 01:36 IST

ఆ జపాన్‌ సంస్థ పరిశీలనలో తెలంగాణ

దిల్లీ: జపాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షార్ప్‌ దేశంలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనికోసం 3-5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.25,000- 40,000 కోట్లు) మేరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను షార్ప్‌ ఉన్నతాధికారులు కలిసి తమ ప్రతిపాదనలను వివరించినట్లు తెలిసింది. 1,000 ఎకరాల్లో ఈ యూనిట్‌ ఏర్పాటుకు షార్ప్‌ ఆలోచిన చేస్తోంది. ఇది జపాన్‌లోని షార్ప్‌ సెమీకండక్టర్‌ యూనిట్‌ను మించి ఉంటుంది. ఇక్కడ తయారయ్యే సెమీకండక్టర్లను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. యూనిట్‌ ఏర్పాటుకు తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలతో షార్ప్‌ చర్చలు నిర్వహిస్తోంది. దీనిపై తుది నిర్ణయానికి రావడానికి 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని