హైదరాబాద్‌లో ‘స్టోరబుల్‌ ఇంక్‌’ విస్తరణ

అమెరికాకు చెందిన సెల్ఫ్‌-స్టోరేజ్‌ టెక్నాలజీ సేవల సంస్థ అయిన స్టోరబుల్‌ ఇంక్‌., హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.

Published : 27 Mar 2024 01:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన సెల్ఫ్‌-స్టోరేజ్‌ టెక్నాలజీ సేవల సంస్థ అయిన స్టోరబుల్‌ ఇంక్‌., హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘ఏషియా జీసీసీ’ పేరుతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలో నెలకొల్పారు. పరిశోధన- అభివృద్ధి కార్యక్రమాలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో 60 మంది ఉద్యోగులు ఉండగా, సంవత్సరాంతానికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇంజినీరింగ్‌, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో కొత్త ఉద్యోగులను తీసుకుంటారు. స్టోరబుల్‌ ఇంక్‌.,  అధ్యక్షుడు ఛార్లీ మారియట్‌, సీటీఓ సతీష్‌ చిలుకూరి, చీఫ్‌ ప్రోడక్ట్‌ ఆఫీసర్‌ జాసన్‌ పాల్మర్‌, ఉపాధ్యక్షుడు జోనాధన్‌ లెవిస్‌, బోర్డు సభ్యుడు అర్వింద్‌ కుమార్‌ తదితరులు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు, మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఛార్లీ మారియట్‌  వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని