ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్‌

ఫ్రాన్స్‌కు చెందిన లూయి విటన్‌ మోయెట్‌ హెన్నెస్సీ (ఎల్‌వీఎంహెచ్‌) ఛైర్మన్‌ బెర్నార్డ్‌ అర్నౌల్ట్‌ ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానానికి చేరుకున్నారు.

Published : 07 Aug 2021 05:06 IST

జెఫ్‌ బెజోస్‌ను అధిగమించి అగ్రస్థానానికి

మూడో స్థానంలో టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌

ముంబయి: ఫ్రాన్స్‌కు చెందిన లూయి విటన్‌ మోయెట్‌ హెన్నెస్సీ (ఎల్‌వీఎంహెచ్‌) ఛైర్మన్‌ బెర్నార్డ్‌ అర్నౌల్ట్‌ ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ను తోసిరాజని ఆయన ఈ రికార్డు సాధించారని ఫోర్బ్స్‌ రియల్‌-టైమ్‌ బిలియనీర్స్‌ జాబితా వెల్లడించింది. ఫ్రెంచ్‌ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్‌ నికర సంపద 19890 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.14.92 లక్షల కోట్లు) నమోదైంది. గతంలోనూ అర్నౌల్ట్‌ 4 సందర్భాల్లో ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానంలో నిలిచారు. 2019 డిసెంబరు, 2020 జనవరి, 2021 మే, 2021 జులైలో ఆయన ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం బెజోస్‌ నికర సంపద 19490 కోట్ల డాలర్లు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ సంపద 18550 కోట్ల డాలర్లుగా ఉంది. ఎల్‌ఎంహెచ్‌ఎం సామ్రాజ్యంలో లూయి విటన్‌, సెఫోరా, టిఫానీ అండ్‌ కంపెనీ, స్టెల్లా మెక్‌కార్ట్‌నీ, గుచి, క్రిస్టియన్‌ డియోర్‌, గివెంచీ వంటి 70 ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ఇవన్నీ సొంతంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, ఎల్‌వీఎంహెచ్‌ కిందే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని