Indane Gas: గ్యాస్‌ సిలెండరే కాదు.. తేనె, చవన్‌ప్రాశ్‌ కూడా తెస్తారు

మీరు ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులా. మీకు తేనె, చవన్‌ప్రాశ్‌ వంటి డాబర్‌ ఉత్పత్తులు  అవసరమైతే.. మీ గ్యాస్‌ పంపిణీదారుకు చెబితే చాలు..

Updated : 24 Feb 2022 09:25 IST

ఇండేన్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా డాబర్‌ ఉత్పత్తుల సరఫరా

దిల్లీ: మీరు ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులా. మీకు తేనె, చవన్‌ప్రాశ్‌ వంటి డాబర్‌ ఉత్పత్తులు  అవసరమైతే.. మీ గ్యాస్‌ పంపిణీదారుకు చెబితే చాలు.. సిలెండర్‌ తీసుకొచ్చే వ్యక్తితో మీ ఇంటికే వాటినీ పంపించే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం డాబర్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్లందరూ డాబర్‌ ఇండియా రిటైల్‌ వ్యాపార భాగస్వాములుగా మారనున్నారు. ‘దేశవ్యాప్తంగా ఇండేన్‌ గ్యాస్‌ను వినియోగించే కుటుంబాలు 14 కోట్లు ఉన్నాయి.. వీళ్లందరూ డాబర్‌ ఉత్పత్తులన్నింటినీ ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్ల నుంచి నేరుగా కొనుగోలు చేయొచ్చ’ని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని