దీర్ఘకాలంలో స్థిరమైన లాభాల కోసం...

దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలు ఆశించే మదుపరులను దృష్టిలో పెట్టుకొని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ కన్సెంప్షన్‌ ఫండ్‌ అనే కొత్త ఈటీఎఫ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) చివరి తేదీ ఈ నెల 14. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌

Published : 02 Jul 2021 01:22 IST

ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ కన్సెంప్షన్‌ ఫండ్‌  

దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలు ఆశించే మదుపరులను దృష్టిలో పెట్టుకొని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ కన్సెంప్షన్‌ ఫండ్‌ అనే కొత్త ఈటీఎఫ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) చివరి తేదీ ఈ నెల 14. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. నిఫ్టీ ఇండియా కన్సెంప్షన్‌ ఇండెక్స్‌ను దీని పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ ఐటీ, ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ ప్రైవేట్‌ బ్యాంకు ఫండ్లు నిర్వహించే హర్ష్‌ సేథీ ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ కన్సెంప్షన్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

నిఫ్టీ ఇండియా కన్సెంప్షన్‌ ఇండెక్స్‌ను 2006లో ఆవిష్కరించారు. అన్ని రంగాలకు చెందిన వినియోగ వస్తువులు అందించే 30 కంపెనీలు ఈ ఇండెక్స్‌లో ఉన్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఈ ఇండెక్స్‌ 14 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ఏడాదికి ఒకటి రెండుసార్లు ఈ సూచీలోని కంపెనీలు వాటి పనితీరు ఆధారంగా మారిపోతూ ఉంటాయి.
ఈటీఎఫ్‌ వంటి పాసివ్‌ ఫండ్ల (ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ తక్కువగా ఉండటం)కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మనదేశంలో అధిక జనాభా కారణంగా అతిపెద్ద వినియోగ మార్కెట్‌ ఉండటం తెలిసిందే. దీనివల్ల వినియోగం నిరంతరం పెరుగుతూనే ఉంటోంది కానీ, తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ విభాగంలోని కంపెనీలపై నేరుగా పెట్టుబడి పెట్టి, స్థిరమైన లాభాలు ఆర్జించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఈటీఎఫ్‌ పథకాల్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండటానికి తోడు, తక్కువ నిర్వహణ వ్యయం, అధిక లిక్విడిటీ, పారదర్శకత ఇటువంటి పథకాల్లో అధికంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని