పీర్ టూ పీర్ లెండింగ్ గురించి తెలుసా?

బంధువుల నుంచో లేదా ప‌క్క వారి నుంచో అప్పుడ‌ప్పుడు కొంత డ‌బ్బు అప్పుగా తీసుకుంటుంటారు. దీనికి వ‌డ్డీ, అస‌లు అనుకున్న ప్ర‌కారం చెల్లింస్తుంటారు.ఇది తెలిసిన విధాన‌మే. అయితే ఇదే విధానాన్ని ఒక మార్కెట్ ప్లేస్ వేదిక‌గా ఆన్ లైన్

Published : 19 Dec 2020 21:04 IST

బంధువుల నుంచో లేదా ప‌క్క వారి నుంచో అప్పుడ‌ప్పుడు కొంత డ‌బ్బు అప్పుగా తీసుకుంటుంటారు. దీనికి వ‌డ్డీ, అస‌లు అనుకున్న ప్ర‌కారం చెల్లింస్తుంటారు.
ఇది తెలిసిన విధాన‌మే. అయితే ఇదే విధానాన్ని ఒక మార్కెట్ ప్లేస్ వేదిక‌గా ఆన్ లైన్ ద్వారా సేవ‌లందించే వాటిని పీ2పీ లెండింగ్ సేవ‌ల సంస్థ‌లు అంటారు. సాధార‌ణంగా ఇవ‌న్నీ ఆన్‌లైన్ ద్వారానే త‌మ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఇవి ఆర్థిక సంస్థ‌లుగా కాకుండా కేవ‌లం సేవ‌లందించే సంస్థ‌గా గుర్తింపు ఉంటుంది. వీరు ఆర్థిక‌ప‌రంగా ఎటువంటి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌రు.

పీ2పీ లెండింగ్
పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రు అప్పుగా డ‌బ్బు తీసుకోవ‌డం. దీన్నే సంక్షిప్తంగా పీ2పీ లెండింగ్ అంటారు. రుణం అవ‌స‌ర‌మ‌య్యే (రుణ గ్ర‌హీత‌లు) వారిని, రుణం ఇచ్చి వ‌డ్డీ ఆదాయం ఆర్జించాల‌నుకునే (రుణదాత‌లు) వారిని ఒక వేదిక‌పైకి తీసుకురావ‌డం. చిన్న చిన్న రుణాలు ల‌భించ‌డం క‌ష్టంగా ఉండేవారికి ఈ వేదిక‌ల ద్వారా సుల‌భ‌మైన సేవ‌లు క‌ల్పించ‌డం. దీనికి ఆ సంస్థ‌లు కొంత మొత్తం ఫీజును తీసుకుంటాయి. ఫీజు వివ‌రాలు తీసుకునే రుణం, పీ2పీ సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం మారుతుంటాయి.

రుణం తీసుకుంటే
ఈ వేదికల ద్వారా రుణాలు తీసుకునేందుకు వ్య‌క్తులు త‌మ ఆర్థిక వివ‌రాల‌ను అందించాల్సి ఉంటుంది. వారి నిబంధ‌న‌ల ప్ర‌కారం యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా వివ‌రాలు అందించాలి. వ‌డ్డీరేటు ఆ వ్య‌క్తి తీసుకునే మొత్తం, రుణం చెల్లించే సామ‌ర్థ్యం త‌దిత‌ర అంశాల ఆధారంగా ఉంటుంది. రుణం తీసుకునే వారికి వార్షిక వ‌డ్డీరేటు 12 శాతం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

రుణం ఇచ్చేవారికి
ఈ వేదికల ద్వారా రుణాలు ఇచ్చే మ‌దుప‌ర్లు గ‌రిష్టంగా వార్షిక రాబ‌డి రేటు12- 36 శాతం వ‌ర‌కూ పొందే అవ‌కాశ‌ముంటుంది. అయితే ఇక్క‌డ న‌ష్ట‌భ‌యం చాలా అధికంగా ఉంటుంది. వ‌చ్చే రాబ‌డి పెరిగే కొల‌దీ రిస్క్ కూడా పెరుగుతుంది. ఈ వెబ్‌సైట్లు లేదా యాప్ లు రుణ‌దాత‌ల‌కు త‌మ రుణాల‌ను ఒకరికే కాకుండా వివిధ వ్య‌క్తుల‌కు అందించేలా సూచిస్తారు. దీని ద్వారా వైవిధ్య‌త పెరిగి న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది.

రాబ‌డికి హామీ ఉండ‌దు
ఈ వేదిక‌ల ద్వారా రుణం ఇచ్చి వ‌డ్డీ పొందాల‌నుకునే వారు గుర్తుంచుకోవాల్సింది వీటిలో డ‌బ్బు తిరిగి చెల్లించే దానిపై హామీ ఉండ‌దు. ఈ లెండిగ్ యాప్ లు స‌ర్వీసు మాత్ర‌మే అందిస్తాయి కానీ ఇత‌ర ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌కు చ‌ట్ట‌ప‌రంగా భాద్య‌త వ‌హించ‌వు. ఈ యాప్ లు వినియోగించే ముందు పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డం మంచిది.

కొన్ని పీ2పీ లెండింగ్ వెబ్‌సైట్లు
ఫెయిర్ సెంట్
ఐ-లెండ్
లెండ్ బాక్స్
లెండెన్ క్ల‌బ్
క్యాష్ కుమార్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని