Published : 24 Dec 2020 22:31 IST

వ్యాపార విస్త‌ర‌ణ కొర‌కు వృత్తి రుణాలు

వృత్తి నిపుణులు త‌మ వ్యాపారాన్ని విస్త‌రింప‌జేసుకునేందుకు ప్ర‌త్యేకంగా రుణాలు ల‌భిస్తాయి. దాంతో వారు అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే దీనికి బ‌దులుగా వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌చ్చుగా అనుకునేవారు లేక‌పోలేదు కానీ వ్య‌క్తిగ‌త రుణం పొందేందుకు అంద‌రు నిపుణుల‌కు వీలుండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే వ్య‌క్తిగ‌త రుణాలు క్రెడిట్ స్కోర్‌, చేసే వృత్తి ద్వారా వ‌చ్చే లాభాల ఆధారంగా ఇస్తారు కాబ‌ట్టి అంద‌రికీ ఇచ్చేందుకు నిరాక‌రించే అవ‌కాశం ఉంటుంది. లాయ‌ర్, చార్ట‌ర్డ్ అకౌంటెంట్, ఆర్కిటెక్ట్, డాక్ట‌ర్ ఇలా ఏదైనా వృత్తి నిపుణులు వారి వ్యాపారాన్ని విస్త‌రింప‌జేసేందుకు నిధుల కోసం ప్ర‌య‌త్నిస్తున్న వారికి ఈ రుణాలు స‌రైన ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.

వృత్తి రుణాలు కూడా వ్యాపార రుణాల వంటివే. ప్ర‌త్యేకంగా అర్హ‌త క‌లిగిన‌ వృత్తి నిపుణులకే వీటిని అందిస్తారు. వ్య‌క్తిగ‌త రుణాలను కూడా వ్యాపారం కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు అయితే ముఖ్యంగా వ్య‌క్తిగ‌త రుణాలు పెళ్లి, ప్ర‌యాణాలు వంటి వాటి కోసం తీసుకుంటారు. వృత్తి రుణాలు మాత్రం కేవ‌లం వ్యాపార విస్త‌ర‌ణ కోసం తీసుకుంటారు.

మీకు వృత్తి, వ్యాపార లేదా వ్య‌క్తిగ‌త రుణాల‌లో ఏది స‌రైన‌దో తెలుసుకోవాలి వ్యాపార అవ‌స‌రాల కోసం ఏ రుణం కావాలో నిర్ణ‌యం తీసుకునేముందు ఏ బ్యాంకు ఎంత వ‌డ్డీ రేటు ఇస్తుందో తెలుసుకొని దాని ప్ర‌కారం ముందుకెళ్లాలి. మీకు ఎక్కువ మొత్తంలో డ‌బ్బు అవ‌స‌ర‌మైతే వ్యాపార రుణాన్ని ఎంచుకోవ‌చ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వ్య‌క్తిగ‌త రుణం కూడా 10.75 శాతం త‌క్కువ వ‌డ్డీతో ల‌భిస్తుంది. అయితే అంద‌రు వృత్తి నిపుణుల‌కు వ్య‌క్తిగ‌త రుణం పొందే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే కొంత‌మందికి రెగ్యుల‌ర్‌గా వేత‌నం పొంద‌క‌పోవ‌చ్చు. వారికి వ్య‌క్తిగ‌త రుణం ల‌భించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక డాక్ట‌ర్‌గా ప్రైవేట్‌గా ప్రాక్టిస్ చేస్తున్న‌ట్ల‌యితే హాస్పిట‌ల్‌లో ఉద్యోగం చేస్తూ క్లినిక్ కూడా ఉంటే వ్య‌క్తిగ‌త రుణం ల‌భిస్తుంది. వీరికి వ్య‌క్తిగ‌త‌, వ్యాపార‌ రుణాల పొందే అవ‌కాశం లేక‌పోతే మిగిలిన ఒకే ఆప్ష‌న్ వృత్తి రుణాలు.

వృత్తి రుణాల వ‌డ్డీ రేట్లు సాధార‌ణంగా 12.75 శాతం నుంచి 18 శాతం వ‌ర‌కు వార్షికంగా ఉంటాయి. అదే వ్య‌క్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీ రేట్లు అయితే 10.75-24 శాతం వ‌ర‌కు ఉంటాయి. వ్యాపార రుణాలు చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వ‌ని చెప్పుకోవ‌చ్చు. వ‌డ్డీ రేట్లు 13 శాతం నుంచి వార్షికంగా 22 శాతం ఉంటాయి. ఇవి వృత్తి రుణాల మాదిరిగా కాకుండా ఆస్తుల‌ను హామీగా ఇవ్వ‌డంతో పాటు, త‌గిన వివ‌రాలు అన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

వృత్తి నిపుణులు రుణాలు తీసుకునేముందు బ్యాంకుల రుణాల‌ను పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ముంద‌స్తు చెల్లింపుల‌పై రుసుములు, లాక్‌-ఇన్ పీరియ‌డ్, కాల‌ప‌రిమితి వంటివి గ‌మ‌నించాలి. వృత్తి నిపుణులు వేత‌నం పొంద‌డంతో పాటు సొంతంగా వ్యాపారం న‌డుపుతున్న‌ట్ల‌యితే వ్య‌క్తిగ‌త రుణం లేదా వృత్తి రుణం ఏది స‌రిపోతుందో చూసుకొని దానిని ఎంచుకోవాలి. సాధార‌ణంగా వ్యాపార రుణాల‌తో పోలిస్తే వృత్తి రుణాల‌పై రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. తిరిగి చెల్లించేందుకు 60 నెల‌ల కాలం ఉంటుంది. కొన్ని బ్యాంకులు 84 నెలలు అంత‌కంటే ఎక్కువ కూడా స‌మ‌యం ఇస్తాయి.

వృత్తి రుణం పొందేట‌ప్పుడు గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే దానికి సంబంధించిన స‌ర్టిఫికెట్లు, అనుభ‌వం ఉన్న‌ట్లుగా చూపే ఆధారాలు వంటివి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. సొంతంగా వ్యాపార‌న్ని ప్రారంభించేందుకు రుణం కావాలంటే 4-5 సంవ‌త్స‌రాల అనుభ‌వం అవ‌స‌రం ఉంటుంది.ప్ర‌స్తుతం ఉద్యోగం చేస్తూ వ్యాపారం కొన‌సాగిస్తున్న‌ట్ల‌యితే క‌నీసం వార్షిక ఆదాయం ల‌క్ష రూపాయ‌లు ఉండటంతో పాటు గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి లాభం పొంది ఉండాలి. వ్య‌క్తులు, భాగ‌స్వామ్య కంపెనీలు కూడా ఈ రుణానికి దాఖ‌లు చేయ‌వ‌చ్చు. బ్యాంకులు, వ్య‌క్తుల ఆధారంగా నియ‌మ నిమంధ‌న‌లు మారుతుంటాయి.

గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు
మీరు ఇప్పుడే ఉద్యోగంలో చేరి జీవితాన్ని ప్రారంభించి భ‌విష్య‌త్తులో సొంతంగా వ్యాపారం చేసుకునే ఆలోచ‌న‌లు ఉంటే ఇప్ప‌టినుంచే రుణం తీసుకోకుండా ఉండేందుకు త‌గిన ప్ర‌ణాళిక‌తో ప‌నిచేయాలి. వ‌చ్చే 4-5 సంవ‌త్స‌రాల‌లో సొంత వ్యాపారం చేయాల‌నుకునేవారు స్థిరాదాయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాలి. దీంతో నిధిని స‌మ‌కూర్చుకొని వ్యాపారం ప్రారంభించాలి.

ఉదాహ‌ర‌ణ‌కు మీ ల‌క్ష్యం సాధించేందుకు ఏడేళ్ల స‌మ‌యం ఉందంనుకుంటే ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఇది మొత్తం ఆరు నెల‌ల వ్యాపార ఖ‌ర్చుల‌కు స‌రిపోయేలా ఉండాలి. ప్ర‌స్తుతం ఉన్న ఉద్యోగంలో వ‌చ్చిన బోన‌స్‌లు, ఉద్యోగంలో వ‌చ్చిన లాభాలు వంటివి కూడా పెట్టుబ‌డులు చేయాలి. సొంతంగా వ్యాపారం ప్రారంభించ‌డం వృత్తి నిపుణుల‌కు ఒక క‌ల‌. ఇది ఇత‌ర ఆర్థిక లక్ష్యాల‌కు అడ్డు రాకూడ‌దు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని