GST collections: ₹1.70 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

GST collections in Jan: జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Updated : 31 Jan 2024 22:25 IST

GST collections | దిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు (GST collections) మరోసారి భారీగా నమోదయ్యాయి. జనవరి నెలకు (31 సాయంత్రం 5 గంటల వరకు) రూ.1,72,129 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది జనవరిలో రూ.1,55,922 కోట్లతో పోలిస్తే 10.4 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటి వరకు వసూలైన వాటిలో ఇదే రెండో అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడో సారి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌- జనవరి మధ్య కాలంలో జీఎస్టీ మొత్తం వసూళ్లు రూ.16.69 లక్షల కోట్లు కాగా.. గతేడాది ఇదే కాలానికి రూ.14.96 లక్షల కోట్ల మేర వసూళ్లు నమోదయ్యాయి. ఐజీఎస్టీ వసూళ్లలో రూ.43,552 కోట్లు సీజీఎస్టీ కింద, రూ.37,257 కోట్లు ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఏప్రిల్‌లో  రూ.1.87 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లలోనే అత్యధికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని