Hero Karizma XMR: హీరో కరిజ్మా వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!

Hero Karizma XMR 210 specs: హీరో మోటోకార్ప్‌ కరిజ్మా XMR 210ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.1.72 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Published : 29 Aug 2023 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ (Hero motocorp) తన మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కరిజ్మాను మళ్లీ లాంచ్‌ చేసింది. కుర్రకారు మెచ్చేలా ఆకర్షణీయమైన డిజైన్‌తో కొత్త కరిజ్మా XMR 210ను మంగళవారం (ఆగస్టు 29న) మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.82 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1.72 లక్షలకే విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్‌కు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. బుకింగ్స్‌ ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.

ఇక ఈ బైక్‌ విషయానికొస్తే.. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. ఐకానిక్‌ ఎల్లో, టర్బో రెడ్‌, మ్యాటీ ఫాంటోమ్‌ బ్లాక్‌ రంగుల్లో విక్రయించనున్నారు. ఇది 210 సీసీ సింగిల్‌ సిలిండర్‌, 4V, DOHC, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 9,250 ఆర్‌పీఎం వద్ద 25.5 పీఎస్‌ పవర్‌ను, 7,250 ఆర్‌పీఎం వద్ద 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ 143 kmphగా కంపెనీ పేర్కొంది. ఇందులో డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉన్నాయి.

చంద్రయాన్‌-3 నుంచి యాపిల్‌ ఈవెంట్‌ దాకా.. యూట్యూబ్‌లో టాప్‌-10 లైవ్‌ స్ట్రీమింగ్‌లివే

ఇందులో ఎల్‌ఈడీ లైట్స్‌, ఎల్‌ఈడీ ఇండికేటర్లు ఇచ్చారు. హెడ్‌ల్యాంప్‌పైన మిర్రర్స్‌ ఇవ్వడం బైక్‌కు స్పోర్టీ లుక్‌ వచ్చింది. ఫుల్లీ డిజిటల్‌ ఇన్సుట్రుమెంటల్‌ క్లస్టర్‌ను ఇచ్చారు.  ఇందులో గేర్‌ పొజిషన్ ఇండికేటర్‌, డేట్‌, టైమ్‌, ట్రిప్‌, ఓడోమీటర్ రీడింగ్‌, ఫ్యూయల్‌ లెవల్‌, టెకోమీటర్‌, స్పీడో మీటర్‌ రీడింగ్స్‌ వంటివి కనిపిస్తాయి. టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ సదుపాయం ఉంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ ఆప్షన్‌ ఉంది. దీంతో కాల్స్‌, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అలర్టులు కనిపిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని