భారత కంపెనీలపై మరో రిపోర్ట్‌.. జార్జిసోరోస్‌ మద్దతున్న గ్రూప్‌ రెడీ!

అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తరహాలోనే మరో సంస్థ భారత కార్పొరేట్ల ఆర్థిక అవకతవకలపై త్వరలో నివేదికను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated : 25 Aug 2023 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అదానీ గ్రూప్‌ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదిక భారతీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేసిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా హిండెన్‌ బర్గ్‌ తరహా మరో సంస్థ భారత కార్పొరేట్ల ఆర్థిక అవకతవకలపై త్వరలోనే నివేదిక విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌, రాక్‌ఫెల్లర్స్ బ్రదర్స్‌ వంటి దిగ్గజాలతో నడుస్తున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (OCCRP) ఈ నివేదికను విడుదల చేయనున్నట్లు పలు ఆంగ్ల వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. 

భారత కార్పొరేట్‌ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపైనే ఈ నివేదిక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్‌నకు చెందిన స్టాక్స్‌ పెద్ద ఎత్తున నష్ట పోయాయి. ఏకంగా 150 బిలియన్‌ డాలర్ల సంపదను ఆదానీ కోల్పోయింది. అయితే ఈ ఆరోపణలను అవాస్తవమని అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది.

రశీదు అడగండి.. అప్‌లోడ్‌ చేయండి.. రూ.కోటి బహుమతి పొందండి

ఏమిటీ OCCRP

పరిశోధనాత్మక కథనాలు వెలువరించే సంస్థగా ఈ ఓసీసీఆర్‌పీ పేరు పొందింది. ఈ సంస్థ 2006లో ప్రారంభమైంది. జార్జ్‌ సోరోస్‌, ఓక్‌ ఫౌండేషన్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, రాకెఫెల్లర్‌ బ్రదర్స్‌ ఫండ్‌ సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థ వ్యవస్థీకృత నేరాలపై నివేదికలు అందిస్తుంది. మీడియా సంస్థల భాగస్వామ్యం ద్వారా ఈ వార్తా కథనాలను ప్రచురిస్తుంది. యూరోప్‌, ఆఫ్రికా, అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాలకు విస్తరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు