Zomato: జొమాటో నుంచి ఇంటి భోజనం.. ‘ఎవ్రీడే’ సేవలు ప్రారంభం

ఆహార డెలివరీ యాప్‌ అయిన జొమాటో బుధవారం సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇంటి తరహా భోజనాన్ని అందించే నిమిత్తం ‘ఎవ్రీడే’ పేరిట సేవలను మొదలుపెట్టినట్లు తెలిపింది.

Updated : 23 Feb 2023 08:50 IST

దిల్లీ: ఆహార డెలివరీ యాప్‌ అయిన జొమాటో బుధవారం సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇంటి తరహా భోజనాన్ని అందించే నిమిత్తం ‘ఎవ్రీడే’ పేరిట సేవలను మొదలుపెట్టినట్లు తెలిపింది. దీని కింద కంపెనీకి చెందిన ఆహార భాగస్వాములు ఇంటి వంటలు చేసే వారితో జట్టుకడతారు. ‘జొమాటో ఎవ్రీడే  ఇంటి తరహా భోజనాన్ని మీకు అందిస్తుంద’ని కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సేవలు గురుగ్రామ్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని గోయల్‌ తెలిపారు. రూ.89 ప్రారంభ ధరతో తాజా, ఆరోగ్యకర ఆహారాన్ని వినియోగదార్లు రోజూ ఆరగించవచ్చని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని