Home Loan: చౌక వ‌డ్డీ రేట్లతో గృహ రుణాలు

గృహ రుణం అందుబాటులో ఉన్న చౌకైన రుణాల‌లో ఒక‌టి

Updated : 01 Jun 2021 13:17 IST

గృహ రుణం ఒక‌రు గానీ, జంట‌గా గానీ తీసుకునే అతిపెద్ద రుణం. గృహ రుణ మొత్తం ప‌రంగానే కాదు, రుణం తీర్చే కాలం కూడా సుదీర్ఘంగా 15 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటుంది.  గృహ రుణం చెల్లించే మొత్తం తుది మొత్తం అరువు తీసుకున్న దాని కంటే రెట్టింపు కావ‌చ్చు. కానీ గృహ రుణం అందుబాటులో ఉన్న చౌకైన రుణాల‌లో ఒక‌టి, సాధార‌ణంగా ఇది వ్య‌క్తులు ఇల్లు కొన‌గ‌ల ఉత్త‌మ‌మైన‌ మార్గం. గృహ రుణాన్ని `మంచి` లోన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది దీర్ఘ‌కాలికంగా అభినందించ‌గ‌ల స్ప‌ష్ట‌మైన ఆస్తిని సంపాదించ‌డానికి మీకు స‌హాయ‌ప‌డుతుంది. మీరు నివ‌సించాల‌ని ప్లాన్ చేస్తే ఇల్లు కొన‌డం అర్ధ‌మే. కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు అతి త‌క్కువ గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌కు రుణాలందిస్తున్నాయి. ఆ వివ‌రాలు క్రింది ప‌ట్టిక‌లో ఉన్నాయి.

మే 27, 2021 నాటికి బ్యాంక్ వెబ్‌సెట్ల నుండి తీసుకున్న డేటా, ఈఎమ్ఐ ప‌రిధి సూచిక‌, వ‌డ్డీ రేటు ప‌రిధి ఆధారంగా లెక్కించ‌బ‌డింది. ఇందులో ఇత‌ర ఛార్జీలు, ఫీజులు ఉండ‌వ‌చ్చు. రుణ ధ‌ర‌ఖాస్తుదారు యొక్క క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వాస్త‌వంగా వ‌ర్తించే వ‌డ్డీ రేటు మార‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని