Maruti Suzuki: మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ సరికొత్త మైలురాయి

Maruti Suzuki pre owned cars: సెకెండ్‌ హ్యాండ్ల కార్లను విక్రయించే మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ సరికొత్త మైలు రాయిని సొంతం చేసుకుంది.

Published : 09 Aug 2023 18:40 IST

దిల్లీ: సెకెండ్‌ హ్యాండ్‌ కార్లను విక్రయించే మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ (Maruti Suzuki True Value) సరికొత్త మైలు రాయిని సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సెకెండ్ హ్యాండ్‌ కార్ల (pre-owned car) విభాగంలో 50 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం వెల్లడించింది. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ 2001లో ఈ రంగంలో అడుగుపెట్టింది.

‘మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ విభాగంలో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రీ ఓన్డ్‌ బ్రాండ్‌గా అవతరించింది. ముఖ్యంగా ఈ విభాగంలో ఇప్పటివరకు 50లక్షల కస్టమర్లను సొంతం చేసుకుంది’ అని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ప్రస్తుతం ట్రూ వాల్యూ విభాగంలో తన వ్యాపారాన్ని 281కి పైగా నగరాల్లో ప్రారంభించింది. రానున్న ఏడేళ్లలో 28 సరికొత్త మోడల్స్‌ను తీసుకురానున్నట్లు మారుతీ ఇటీవల ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని