Cybercrime: సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లోకి రూ.10,300 కోట్లు!

Cybercrime Report: దేశంలో 2021 ఏప్రిల్‌ నుంచి 2023 డిసెంబరు మధ్యకాలంలో సైబర్‌ నేరగాళ్లు రూ.10,300 కోట్లు కాజేసినట్లు ‘ఐ4సీ’ డైరెక్టర్ రాజేశ్‌ కుమార్ వెల్లడించారు.

Published : 03 Jan 2024 22:27 IST

Cybercrime Report | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సైబర్‌ నేరాలు (Cyber Crimes) రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది కేటుగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు. 2021 ఏప్రిల్‌ 1 నుంచి 2023 డిసెంబరు 31 వరకు వరకు సైబర్‌ నేరగాళ్లు దేశవ్యాప్తంగా రూ.10,319 కోట్లు కొల్లగొట్టినట్లు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) వెల్లడించింది. అందులో రూ.1,127 కోట్లను విజయవంతంగా బ్లాక్‌ చేసినట్లు తెలిపింది. దేశంలో నమోదైన సైబర్‌ నేరాలకు సంబంధించిన వివరాలను ‘ఐ4సీ’ డైరెక్టర్ రాజేశ్‌ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే..

  • నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్ పోర్టల్‌ (NCCRP)లో 2021లో 4.52 లక్షలకుపైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.
  • 2022లో సైబర్‌ కేసుల సంఖ్యలో 113.7 శాతం పెరుగుదల నమోదై.. 9.66 లక్షలకు చేరుకుంది.
  • 2023లో ఏకంగా 15.56 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు 129 సైబర్‌ కేసులు వెలుగుచూశాయి.
  • బ్లాక్‌ చేసిన రూ.1,127 కోట్లలో 9 నుంచి 10 శాతం సొమ్మును బాధితుల ఖాతాల్లోకి మళ్లీ జమచేశారు.
  • దాదాపు 50 శాతం సైబర్ దాడులు కంబోడియా, వియత్నాం, చైనా తదితర దేశాల నుంచే జరిగాయి.
  • దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెక్స్‌టార్షన్, ఆన్‌లైన్ బుకింగ్, ఓఎల్‌ఎక్స్‌ వంటి మార్గాల ద్వారా ఎక్కువగా మోసాలకు పాల్పడ్డారు.
  • సైబర్‌ బాధితులు తమ డబ్బును సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోందని,  వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకురానుందని రాజేశ్‌ కుమార్‌ వెల్లడించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని