Poco pods: పోకో నుంచి ఫస్ట్ ఇయర్‌బడ్స్.. రూ.1,199కే విక్రయం

Poco wireless earbuds: చైనా మొబైల్ కంపెనీ షావోమీ పోకో మొదటి సారిగా వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ని భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

Updated : 29 Jul 2023 18:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ పోకో (Poco) మొదటి సారిగా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ని భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటికి పోకో పాడ్స్‌ అని నామకరణం చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌కు 30 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ప్రారంభ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్‌తో రూ.1,199కే అందించనుంది. వీటిలో నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సదుపాయం కూడా ఉంది.

కొత్త లోగో ఏర్పాటు.. చిక్కుల్లో మస్క్‌ ‘ఎక్స్‌’

ఈ ఇయర్‌బడ్స్‌లో 34mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. వీటిని వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్‌ కేస్‌లో 440mAh బ్యాటరీ ఉంది. ఈ ఛార్జింగ్ కేస్‌తో 30 గంటలపాటు బ్యాటరీ స్టాండ్‌బైలో ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో గంటన్నర మ్యూజిక్‌ వినొచ్చని పోకో చెబుతోంది. ఇది బ్లూటూత్‌ 5.3కి సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో 12mm డైనమిక్‌ డ్రైవర్‌ను ఉపయోగించారు. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్‌ ఆడటానికి వీలుగా లాటెన్సీ గేమింగ్‌ మోడ్‌ను ఇచ్చారు. IPX4 రేటింగ్‌ కలిగిన వాటర్‌ రెసిస్టెన్స్‌ సదుపాయం ఉంది. తక్కువ ధరలో టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ కోసం చూస్తున్న వారు దీన్ని పరిశీలించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని