Elon Musk: కొత్త లోగో ఏర్పాటు.. చిక్కుల్లో మస్క్‌ ‘ఎక్స్‌’

ఎలాన్‌ మస్క్‌(Elon Musk) తన నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా తన సామాజిక మాధ్యమ సంస్థ లోగో మార్పు విషయంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 29 Jul 2023 12:06 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter) త్వరలో ఓ సూపర్‌ యాప్‌గా (Super app) రూపాంతరం చెందబోతోందని చెప్తూ..  ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) దాని పేరును ‘ఎక్స్‌.కామ్‌’గా మార్చారు. ఈ మార్పు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆయనకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.

ట్విటర్ కేంద్ర కార్యాలయంపై ఏర్పాటు చేసిన లోగో గురించి శాన్‌ఫ్రాన్సిస్కో యంత్రాంగం విచారణకు ఆదేశించింది. భవనాల తనిఖీల విభాగం అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం..  ఒక సంస్థ లోగో, గుర్తును మార్చాలనుకున్నప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాలి. డిజైన్‌, భద్రతా కారణాల దృష్ట్యా ఈ అనుమతులు అవసరమని చెప్పారు.

ఎలాన్‌ మస్క్‌ కొత్త ‘ఎక్స్‌’కు సరికొత్త చిక్కులు.. పోర్న్‌సైట్‌లా పేరుండటమే కారణం!

అపర కుబేరుడైన ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి దానిలో అనూహ్య మార్పులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల పిట్ట స్థానంలో ఎక్స్‌ వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఆ గుర్తుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సోషల్‌ మీడియా సంస్థ నెలవారీ యాక్టివ్‌ యూజర్లు భారీగా పెరిగినట్లు మస్క్ వెల్లడించారు. ఆ సంఖ్య 540 మిలియన్లకు చేరిందని చెప్పారు. దానికి సంబంధించిన గ్రాఫ్‌ను షేర్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని