Adani Green: అదానీ గ్రీన్‌, శ్రీలంక ప్రభుత్వం మధ్య విద్యుత్‌ ఒప్పందం

శ్రీలంకలో పవన విద్యుత్‌ కేంద్రాల స్థాపన కోసం భారత్‌కు చెందిన అదానీ గ్రీన్‌, శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.

Published : 07 May 2024 17:40 IST

కొలంబో: దేశంలో పవన విద్యుత్‌ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు భారత బిలియనర్‌ గౌతమ్‌ అదానీకి చెందిన పునరుత్పాదక ఇంధన విభాగం అదానీ గ్రీన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు శ్రీలంక కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. రెండు పార్టీల మధ్య 20 ఏళ్ల పాటు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరగనుంది. ఉత్తర శ్రీలంకలో ఉన్న రెండు ప్రాంతాల్లో 484 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్ల అభివృద్ధికి 442 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి పునరుత్పాదక ఇంధన సంస్థ గతేడాది ఆమోదం పొందింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న శ్రీలంక 2022లో ఆర్థిక మాంద్యం మధ్య తీవ్రమైన విద్యుత్తు అంతరాయాలు, ఇంధన కొరతను ఎదుర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని