Akasa Air: ఉద్యోగులను ఆకర్షించేందుకు ‘ఆకాశ’ కొత్త వ్యూహం

బిలియనీర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న కొత్త విమానయాన సంస్థ ఆకాశ మే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది......

Updated : 04 Feb 2022 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిలియనీర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ మే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రంగంలో నిలదొక్కుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను ఆశ్రయిస్తోంది. అందులో భాగంగా ఉన్నతోద్యోగులతో పాటు సామాన్య సిబ్బందిని సైతం ఆకర్షించేందుకు వారికి స్టాక్‌ ఆప్షన్స్‌ని ఆఫర్‌ చేయాలని యోచిస్తోందని కంపెనీ సీఈఓ వినయ్‌ దూబే ఓ ముఖాముఖిలో తెలిపారు.

సాధారణంగా స్టాక్‌ ఆప్షన్‌ని నైపుణ్యం గల ఉద్యోగుల్ని ఆకర్షించడానికి సాంకేతిక రంగంలో వచ్చే అంకుర సంస్థలు ఆఫర్‌ చేస్తుంటాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆధారపడ్డ అనేక మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. వారిలో ప్రతిభ గల వారిని ఆకర్షించి ఆదుకోవడమే తమ ఉద్దేశమని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇతర ఏ సంస్థల్లో.. చివరకు టెక్‌ స్టార్టప్‌లు కూడా అందించని స్థాయిలో తమ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్‌ ఆఫర్‌ చేయనున్నట్లు వెల్లడించాయి. పైలట్లు, సహాయక సిబ్బందికి మాత్రం ఇది వర్తించదని పేర్కొన్నాయి.

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది ఇండస్ట్రీ పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన ఆకాశ ఎయిర్‌ విమానయాన సంస్థ.. ఇప్పటి వరకు సన్నాహక పనుల కోసం 50 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. ప్రస్తుతం పైలట్లు, సహాయక సిబ్బంది, ఎయిర్‌పోర్టు స్టాఫ్‌ నియామక ప్రక్రియ కొనసాగుతున్నట్లు వినయ్‌ దూబే తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని