Reliance Jio: 4జీ డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ వేగంలో జియో టాప్‌: ట్రాయ్‌

4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంలో రిలయన్స్‌ జియో మరోసారి నంబర్‌ 1నగా నిలిచింది. వరుసగా రెండో నెలా ఈ విషయంలో అగ్రస్థానం దక్కించుకుంది.

Published : 17 Nov 2022 19:26 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో (Reliance Jio) 4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంలో మరోసారి నంబర్‌ 1గా నిలిచింది. వరుసగా రెండో నెలా ఈ విషయంలో అగ్రస్థానం దక్కించుకుంది. అక్టోబర్‌ నెలలో 20.3 Mbps సగటు 4G డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వెల్లడించింది. ఈ మేరకు 4G స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది.

ట్రాయ్‌ డేటా ప్రకారం.. జియో సగటు 4G డౌన్‌లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుంచి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది. సగటు డౌన్‌లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్‌టెల్‌ (Airtel), వొడాఫోన్‌ ఐడియా (VI) మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎయిర్‌టెల్ సగటు 4G డౌన్‌లోడ్ వేగం 15 Mbps కాగా వొడాఫోన్‌ 14.5 Mbps. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌, వొడాతో పోలిస్తే జియో 4G డౌన్‌లోడ్ వేగం 5 Mbps ఎక్కువగా ఉంది.

సగటు 4G అప్‌లోడ్ వేగం పరంగా కూడా రిలయన్స్ జియో గత నెలలో తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 Mbps సగటు 4G అప్‌లోడ్ వేగంతో జియో టాప్‌లో నిలిచింది. ఈ విషయంలో వొడాఫోన్‌ ఐడియా 4.5 Mbps వేగంతో రెండో స్థానంలో, 2.7 Mbps వేగంతో ఎయిర్‌టెల్ మూడో స్థానంలో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని