Renault-Nissan: నిస్సాన్‌లో భారీగా వాటా తగ్గించుకున్న రెనాల్ట్
రెండు సంస్థలు మధ్య మైత్రిని మెరుగుపరుచుకునే ఒప్పందంలో భాగంగానే నిస్సాన్ (Nissan)లో వాటాను తగ్గించుకుంటున్నట్లు రెనాల్ట్ ( Renault) ప్రకటించింది.
టోక్యో: ఫ్రెంచ్‌కి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ ( Renault).. తన వ్యాపార భాగస్వామి నిస్సాన్ (Nissan) లో వాటాను భారీగా తగ్గించుకుంటోంది. రెండు సంస్థల మధ్య మైత్రిని తిరిగి సమతుల్యం చేసుకొనే ఒప్పందంలో భాగంగానే రెనాల్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిస్సాన్ వెల్లడించింది. నిస్సాన్‌లో రెనాల్ట్‌కు 43.4శాతం వాటా ఉండగా.. దాన్ని 15శాతానికి తగ్గించుకోనుంది.
రెనాల్ట్‌లో నిస్సాన్‌కు 15 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో నిస్సాన్‌లోనూ రెనాల్ట్ వాటాలను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నిస్సాన్‌లో 43శాతం వాటాను కలిగి ఉన్న రెనాల్ట్.. అందులో 28.4 శాతాన్ని వెంటనే విక్రయించకుండా తన ఫ్రెంచ్ ట్రస్ట్‌కు బదిలీ చేయబోతున్నట్టు తెలిపింది. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ విలువ రెనాల్ట్ ఖాతాలలో నమోదు చేసిన దాని కంటే తక్కువగా ఉంది. బోర్డు ఆమోదం పొందిన తరవాత రెండు సంస్థలు వచ్చే వారంలో కొత్త ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.
ఈ నిర్ణయంతో రెండు కంపెనీల మధ్య చాలాకాలంగా ఉన్న విభేదాలకు పరిష్కారం లభించే అవకాశముంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా విద్యుదీకరణ, ఆటోమేషన్ పరిశ్రమలకు లబ్ది చేకూర్చుతుందని సంస్థల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
రెనాల్ట్ కొత్తగా తీసుకురానున్న విద్యుత్ వాహన వ్యాపారం ఆంపియర్‌లో తాను కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్‌కి చెందిన నిస్సాన్ తెలిపింది. కానీ, ఎంత మొత్తంలో పెట్టుబడులు ఉంటాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే కొత్త ఒప్పందం ద్వారా రెండు సంస్థల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో పాటు వాటాదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. రెనాల్ట్ తన కార్యకలాపాలను రెండు వ్యాపారాలుగా మార్చనున్నట్టు గతేడాది నవంబర్‌లోనే ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్ పితామహుడు
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
-
Crime News
Mumbai: ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. మామను చంపిన అల్లుడు
-
World News
Ferry: ప్రయాణికుల నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి..!
-
General News
Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
-
India News
Tamil Nadu: తమిళనాట ‘పెరుగు’ వివాదం.. పేరు మార్పుపై రగడ