Jio Financial Demerger: జులై 20న RSIL షేర్‌ అలాట్‌మెంట్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన ఆర్థిక సేవల వ్యాపారానికి సంబంధించిన విభజన ప్రణాళిక రికార్డు తేదీని నిర్ణయించింది.

Published : 08 Jul 2023 19:15 IST

దిల్లీ: రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ (RSIL)లో తన ఆర్థిక సేవల వ్యాపారానికి సంబంధించిన ఈక్విటీ షేర్ల కేటాయింపు కోసం రికార్డు తేదీని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌  ప్రకటించింది. ఒప్పందం ప్రకారం RSIL.. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (JFSL)గా పేరు మారుతుంది. ఇది స్టాక్‌ ఎక్స్చేంజీలలో ట్రేడింగ్‌ కోసం లిస్ట్‌ అవుతుంది. హితేష్‌ కుమార్‌ సేథీ కొత్త సంస్థకు ఎండీ అండ్‌ సీఈఓగా వ్యవహరిస్తారని RSIL ప్రకటించింది. ప్రతి ఒక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేరుకు ఒక ఆర్‌ఎస్‌ఐఎల్‌ (ముఖ విలువ రూ.10) షేర్‌ కేటాయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని