Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.  

Updated : 19 Mar 2024 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ సూచీల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నేటి ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 410 పాయింట్లు పతనమై 72,337 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు కుంగి 21,946 సమీపంలో కొనసాగుతున్నాయి. 

రూపాయ విలువ 2 పైసలు బలహీనపడి రూ.82.93గా ఉంది. పిరమాల్‌, ధనీ సర్వీసెస్‌, ఐవోఎల్‌ కెమికల్స్‌, కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ, హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌, డీబీ రియల్టీ, మైక్రోటెక్‌ డెవలపర్స్‌, స్టార్‌ హెల్త్‌, టీసీఎస్‌ షేర్లు భారీగా కుంగాయి. ఐటీ రంగం వృద్ధిరేటు పరిమితంగా ఉంటుందని ఇక్రా నివేదిక ఇవ్వడం సూచీలపై ప్రభావం చూపింది. 

బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ 2007 తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. దీన్ని సున్నా నుంచి 0.1శాతం చేసింది. అంతేకాదు.. ఈల్డ్‌ కర్వ్‌ కంట్రోల్‌ విధానాన్ని రద్దు పర్చింది. ఆస్ట్రేలియా సూచీ మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని