Ola Scooter: ఓలా స్కూటర్‌  ప్రీ బుకింగ్‌ చేసుకున్నారా... ఇక రెడీ అయిపోండి!

Ola EV Scooter: ఓలా స్కూటర్లు ఎలా కొనాలి, ధర ఎంత, ఈఎంఐ సౌకర్యం తదితర వివరాలు మీ కోసం...

Published : 07 Sep 2021 19:50 IST

ఓలా విద్యుత్తు స్కూటర్‌ కోసం ఆన్‌లైన్‌ ఇప్పటికే ప్రీ బుకింగ్‌ చేసుకున్నారా? ఎప్పుడెప్పుడు కొందామా అని వేచి చూస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఓలా స్కూటర్లు ఎలా కొనాలి, ధర ఎంత, ఈఎంఐ సౌకర్యం ఉందా? తదితర వివరాలతో ప్రత్యేక కథనం మీకోసం..


🛵 సెప్టెంబరు 8నుంచి ఓలా స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ విద్యుత్తు వాహనాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా ఒక రోజు ముందే.. అంటే సెప్టెంబరు 8నే ఎస్‌ 1, ఎస్‌ 1 ప్రో పేరుతో  రెండు విద్యుత్తు వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.  అయితే స్టాక్‌ ఉన్నంతవరకే అమ్మకాలు అనే విషయం మరచిపోకండి.


🛵 ఆన్‌లైన్‌లోనే జరగనున్న ఈ అమ్మకాల ప్రక్రియలో  ‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌’ విధానాన్ని అవలంబిస్తారు. అంటే ముందుగా అడ్వాన్స్‌ చెల్లించిన వారికే ఆ స్కూటర్లు లభ్యం కానున్నాయి. 


🛵 ఓలా ఎస్‌ 1 ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹99,999 కాగా, ఎస్‌ 1 ప్రో ధర ₹1,29,999. 


🛵 విద్యుత్తు వాహనాలకు ఆయా రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలు, ఇతర ఆఫర్లను బట్టి... వాహనం ధర మారుతుంది. 


🛵 ఈఎంఐ సౌకర్యం అందించడానికి ఓలా ఇప్పటికే వివిధ ఫైనాన్స్‌ సర్వీసులతో జట్టుకట్టింది. ఈ క్రమంలో ఎస్‌ 1 ఈఎంఐ ₹2,999గా ఉంటుంది. ఎస్‌ 1 ప్రో ₹3,199గా ఉండనుంది.  


🛵 ఈఎంఐ సౌకర్యం పొందడానికి ₹20 వేలు అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బుకింగ్‌ క్యాన్సిల్‌ చేయాలనుకుంటే... ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. 


🛵 వాహనాలను టెస్ట్‌ రైడ్‌ చేసే అవకాశం కూడా ఓలా కల్పిస్తోంది. అక్టోబరులో ఈ టెస్ట్‌ రైడ్‌లు ప్రారంభమవుతాయి. 


🛵 అక్టోబరులోనే వాహనాల డెలివరీ ఉంటుందట. డబ్బులు కట్టి బుక్‌ చేసుకున్నవారి ఇంటికి నేరుగా వాహనాన్ని అందజేస్తామని ఓలా చెబుతోంది. అలాగే అవసరమైతే ఇంటి వద్దకే తమ సిబ్బంది వచ్చి సర్వీస్‌ చేస్తారని పేర్కొంటోంది. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని