Tata tech IPO: 2 దశాబ్దాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. తేదీ, ఇతర వివరాలు ఇవే!

Tata Technologies IPO: టాటా గ్రూప్‌ నుంచి 2 దశాబ్దాల తర్వాత ఐపీఓ రానుంది. టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ నవంబర్‌ 22 నుంచి 24 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది.

Updated : 14 Nov 2023 14:47 IST

Tata Technologies IPO | దిల్లీ: టాటా గ్రూప్‌ (Tata group) నుంచి చాలా రోజుల తర్వాత ఐపీఓ వస్తోంది. మదుపరులు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ (Tata Technologies IPO) నవంబర్‌ 22న ప్రారంభం కాబోతోంది. నవంబర్‌ 24తో సబ్‌స్క్రిప్షన్‌ ముగియనుంది. టాటా గ్రూప్‌ నుంచి చివరిగా టీసీఎస్‌ ఐపీఓకు వచ్చింది. మళ్లీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీఓ ఇదే కావడం గమనార్హం. దీంతో మదుపరుల్లో ఆసక్తి నెలకొంది.

టాటా మోటార్స్‌కు చెందిన టాటా టెక్నాలజీస్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ సంస్థ. టాటా మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్‌ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. అలాగే ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్‌ 2.4 శాతం, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్‌ చేశారు.

Tesla: కేంద్రమంత్రికి మస్క్‌ క్షమాపణలు.. ఎందుకంటే..?

టాటా టెక్నాలజీస్‌ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బోఫా సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. అయితే, ఐపీఓ సైజ్‌, ధరల శ్రేణి వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఐపీఓ కోసం ఈ ఏడాది మార్చి 9న సెబీకి దరఖాస్తు చేసుకోగా.. ఆమోదం లభించింది. అయితే, కంపెనీ ముందుగా అనుకున్న దాని కంటే ఈ ఐపీఓ పరిమాణం తగ్గనుంది. త్వరలో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని