బ‌హుమ‌తిపై ప‌న్ను ఎప్పుడు వ‌ర్తించ‌దు?

ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న ‌చ‌ట్టం ప్ర‌కారం బ‌హుమ‌తి పొందిన వారు ప‌న్నుచెల్లించాలి. తొలిసారిగా గిఫ్ట్ పై ప‌న్ను విధించేందుకు గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ 1958 ద్వారా ప్రారంభ‌మైంది. ఈ చ‌ట్టం ప్ర‌కారం ప‌న్ను బ‌హుమ‌తి ఇచ్చేవారు చెల్లించాలి. బ‌హుమ‌తి ఇచ్చేవారు 30 శాతం ప‌న్ను చెల్లించాలి. బేసిక్ మిన‌హాయంపు..

Updated : 25 Dec 2020 14:24 IST

ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న ‌చ‌ట్టం ప్ర‌కారం బ‌హుమ‌తి పొందిన వారు ప‌న్నుచెల్లించాలి. తొలిసారిగా గిఫ్ట్ పై ప‌న్ను విధించేందుకు గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ 1958 ద్వారా ప్రారంభ‌మైంది. ఈ చ‌ట్టం ప్ర‌కారం ప‌న్ను బ‌హుమ‌తి ఇచ్చేవారు చెల్లించాలి. బ‌హుమ‌తి ఇచ్చేవారు 30 శాతం ప‌న్ను చెల్లించాలి. బేసిక్ మిన‌హాయంపు రూ.30000 ఉండేది. కానీ 1998 లో ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేశారు. ప‌న్ను ఎగ‌వేత‌లు పెరుగుతుండంటంతో ప్ర‌భుత్వం తిరిగి మ‌ళ్లీ 2004 లో ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం లో భాగంగా గిఫ్ట్ ప‌న్ను ను ప్రారంభించారు. ఈ చ‌ట్టం ఏప్రిల్ 1, 2005 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం బ‌హుమ‌తి పొందిన వారు ప‌న్నుచెల్లించాలి. బ‌హుమ‌తి ప‌న్ను చ‌ట్టం లో కాల‌క్ర‌మేణా చాలా మార్పులు వ‌చ్చాయి. మొద‌ట్లో కేవ‌లం వ్య‌క్తులు, హిందూ అభివాజ్య కుటుంబాల‌కు మాత్ర‌మే ప‌న్ను చెల్లింపు ఉండేది ప్ర‌స్తుతం వ్యక్తి, హెచ్‌యూఎఫ్‌ , సంస్థ, వ్యక్తుల సంఘం, మొదలైన వారిని ప‌న్నుప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు.

ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం 1961 కింద బ‌హుమ‌తి ప‌న్ను

 

ఒక వ్య‌క్తి (బ‌హుమ‌తి ఇచ్చిన‌వారు లేదా తీసుకున్న‌వారు) డ‌బ్బు లేదా స్థిరమైన ఆస్తి లేదా ఇతర ఆస్తులు వేరొక వ్యక్తి (దాత) నుంచి తీసుకుని స‌రైన విధంగా లెక్క చూపించ‌క‌పోయినా,మార్కెట్ విలువ కంటే తక్కువ ధ‌ర‌, స్థిరాస్తి విషయంలో స్టాంప్ డ్యూటీ విలువ కంటే త‌క్కువ చూపించినా అటువంటి బహుమతి విలువపై పన్ను విధిస్తారు. ఆ చ‌ట్టం ప్ర‌కారం ఆస్తి అంటే భూమి లేదా భవనం లేదా రెండూ, షేర్లు, సెక్యూరిటీలు, ఆభరణాలు, పురావస్తు సేకరణలు, డ్రాయింగ్లు, చిత్రలేఖనాలు, శిల్పాలు, కళ బులియన్ మొదలైనవి. కొన్ని నిర్దిష్ట వర్గాల వ్యక్తులకు / గ్రహీతలకు పన్ను మినహాయింపు ఉంటుంది. పన్నుల నుండి పొందింది.

కింద తెలిపిన సంద‌ర్బాల్లో బహుమతుల‌పై ప‌న్ను మినహాయింపు ఉంటుంది. బంధువు నుంచి ధనం లేదా ఏదైనా ఆస్తి పొందిన‌ప‌డు ఈ సందర్భంలో పన్ను కట్టే అవసరం లేదు. బంధువు అంటే ఆదాయ‌ప‌న్ను చ‌ట్టంలో వివ‌రంగా ఉంటుంది.

వివాహం సందర్భంగా ఏ వ్యక్తి నుంచి అయినా అందుకున్న డబ్బు లేదా ఆస్తి.

♦ విల్లు ఆధ‌రాంగా లేదా వారసత్వంగా పొందిన ఏదైనా సొమ్ము లేదా ఏదైనా ఆస్తి.

♦ చెల్లింపుదారు మరణం అనంత‌రం ఏదైనా మొత్తం డబ్బు లేదా ఏదైనా ఆస్తి.

♦ ఒక వ్య‌క్తికి ఆస్తిని అందించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ట్ర‌స్టు ద్వారా పొందిన‌ సొమ్ము లేదా ఆస్తి; ఈ సంద‌ర్భాల్లో బ‌హుమ‌తుల పై ప‌న్ను వ‌ర్తించ‌దు.

బ‌హుమ‌తుల‌కు సంబంధించి ఫెమా నిబంద‌న‌లు

దేశంలో ఉండే ఆదాయ పన్నుచ‌ట్టంతో పాటు విదేశాల‌నుంచి అందే బ‌హుమ‌తుల‌పై ప‌న్నుకు సంబంధించి ఎన్నారై, పీఐఓ ల‌కు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999 కూడా వ‌ర్తిస్తుంది. బంధువు అనే ప‌దానికి అర్థం మ‌న దేశ ఆదాయ‌ప‌న్ను చ‌ట్టంలో, ఫెమా లో వివ‌రించిన దానిని గ‌మ‌నించాలి. ఫెమాలో బంధువు అనే దాని వివ‌ర‌ణ ఆదాయ‌ప‌న్ను చ‌ట్టంలో బంధువు వివ‌ర‌ణ కంటే స్వ‌ల్ప ప‌రిధిని క‌లిగి ఉంటుంది. ఫెమా ప్ర‌కారం బంధువు అంటే భార్య, తండ్రి, తల్లి, కుమారుడు, కొడుకు భార్య, కుమార్తె, కుమార్తె భర్త, సోదరుడు, సోదరి ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని