52 ల‌క్ష‌ల చందాదారుల‌ కేవైసీ వివ‌రాలు అప్‌డేట్ చేసిన ఈపీఎఫ్ఓ

కేవైసీకి యూఏఎన్‌ లింక్ చేయడం ద్వారా ఉద్యోగులు లేదా చందాదారుల గుర్తింపు ధృవీకరణకు సహాయపడుతుంది..

Updated : 01 Jan 2021 17:49 IST

మీ కేవైసీ వివరాలను సరిదిద్దిన తర్వాత మీరు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేయవ‌చ్చు. 2020 ఏప్రిల్, మే నెలల్లో ఈపీఎఫ్ఓ 52.62 లక్షల మంది సభ్యుల కేవైసి డేటాను అప్‌డేట్ చేసింది. ఇందులో 39.97 లక్షల మంది సభ్యుల ఆధార్ వివ‌రాలు, 9.87 లక్షల మంది వినియోగదారులకు మొబైల్ నంబ‌ర్ వివ‌రాలు (యుఎఎన్ యాక్టివేషన్), 11.11 లక్షల మంది చందాదారులకు బ్యాంక్ ఖాతా వివ‌రాల‌ను సవ‌రించింది. కేవైసీ కోసం గత రెండు నెలల్లో 4.81 లక్షల పేరు దిద్దుబాట్లు, 2.01 లక్షల పుట్టిన తేదీలు, 3.70 లక్షల ఆధార్ సంఖ్యల‌ను వివరాలను ఈపీఎఫ్ఓ సరిచేసింది.

పీఎఫ్ కేవైసీ అనేది ఒకేసారి చేసే ప్రక్రియ, ఇది కేవైసీ వివరాలతో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ను లింక్ చేయడం ద్వారా సభ్యులు లేదా ఉద్యోగులు లేదా చందాదారుల గుర్తింపు ధృవీకరణకు సహాయపడుతుంది. కేవైసీ వివరాలు అంటే పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా వంటివి. ఈ వివరాలను ఈపీఎఫ్ఓ సభ్యుల పోర్టల్‌లో ఇంకా నవీకరించకపోతే, వెంట‌నే వాటిని పూర్తి చేయడం మంచిది.

కేవైసీ అప్‌డేట్ చేసినత‌ర్వాత‌, బ్యాంక్ ఖాతా, ఆధార్ వంటి వివ‌రాలు సవ‌రించిన తర్వాత, యజమాని ధృవీకరణ లేకుండా క్లెయిమ్‌ను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. సభ్యుడు యూఏఎన్ పోర్టల్‌లో లాగిన్ చేయడం ద్వారా తన నెలవారీ సహకార వివ‌రాల‌ను చూడవచ్చు. అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా కేవైసీ ని నవీకరించవచ్చు. పేరు, పుట్టిన తేదీ దిద్దుబాటు కోసం ఆన్‌లైన్ అభ్యర్థన పోర్టల్‌లో అవ‌కాశ‌ముంది.

ఈపీఎఫ్ఓ ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాల‌ ప్ర‌కారం, ఆధార్లో నమోదు చేసిన‌ పుట్టిన తేదీని సరిదిద్దే ఉద్దేశ్యంతో పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా అంగీకరించబడుతుంది, రెండు తేదీలలో వ్యత్యాసం 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే. పీఎఫ్ చందాదారులు దిద్దుబాటు అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) తో ఆన్‌లైన్‌లో సభ్యుల పుట్టిన తేదీని తక్షణమే ధృవీకరించడానికి ఈపీఎఫ్ఓకు అనుమతిస్తుంది, తద్వారా మార్పు అభ్యర్థనల ప్రాసెసింగ్ సమయాన్ని ప్రామాణీకరించడం, తగ్గించడానికి అవ‌కాశం జ‌రుగుతుంది. మీరు కోవిడ్‌-19 కోసం పీఎఫ్ క్లెయిమ్ ఇంతకు ముందే దరఖాస్తు చేసుకుంటే, పీఎఫ్ కేవైసీ చెక్ చేయడం మంచిది. ఏదైనా నవీకరణ, దిద్దుబాటు అవసరమైతే చూడండి. మళ్ళీ దరఖాస్తు చేయడానికి ముందు వాటిని పూర్తి చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని