Wipro: విప్రోకు జతిన్‌ దలాల్‌ రాజీనామా.. కొత్త సీఎఫ్‌వోగా అపర్ణ అయ్యర్‌!

విప్రో సీఎఫ్‌వో పదవికి జతిన్‌ దలాల్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎఫ్‌వోగా అపర్ణా అయ్యర్‌ నియమితులయ్యారు.

Updated : 21 Sep 2023 18:56 IST

బెంగళూరు: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో(Wipro)లో కీలక ఉద్యోగి జతిన్‌ దలాల్‌ రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఇదే సంస్థలో పనిచేసిన ఆయన.. ఇతర అవకాశాల నేపథ్యంలో తన చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. దలాల్‌ స్థానంలో కొత్త సీఎఫ్‌వోగా అపర్ణా అయ్యర్‌ను నియమించినట్టు విప్రో తన ఎక్సేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. దాదాపు 20 ఏళ్లుగా కంపెనీలో కొనసాగుతోన్న అపర్ణ సెప్టెంబర్‌ 22 నుంచి కొత్త బాధ్యతలు చూస్తారని పేర్కొంది.

అపర్ణ గత కొన్నేళ్లుగా తమ సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో అంతర్భాగంగా ఉన్నారని.. ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని విప్రో సీఈవో థియర్రీ డెలాపోర్ట్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. 2002లో విప్రోలో చేరిన దలాల్‌.. 2015లో ఆ సంస్థలో  ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్‌ 30న ఆయన ఈ కంపెనీని వీడనున్నారు.

కుటుంబాల పొదుపులు సగానికి తగ్గాయ్‌.. అప్పులు రెండింతలు పెరిగాయ్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని