Crime news : దూసుకొచ్చిన మృత్యువు.. తమిళనాడులో ఏడుగురు మహిళలు మృతి!

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం చెందారు.

Published : 11 Sep 2023 15:06 IST

చెన్నై : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం తిరుపత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతిచెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న వెల్లూరు జిల్లాకు చెందిన 24 మంది పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఓ మినీ బస్సులో బయలుదేరి కర్ణాటక వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైన వారి వాహనం బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై మొరాయించింది. దాంతో ఆ వాహనాన్ని ఉదయం 3 గంటల ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా నట్రంపల్లి శివారులో పార్క్‌ చేశారు. దానికి మరమ్మతులు చేస్తుండగా బస్సులోని మహిళలు కిందికి దిగి రోడ్డు పక్కనే కూర్చున్నారు. అంతలోనే వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది. దాంతో బస్సు రోడ్డుపై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. 

నందివాడ ఎస్‌ఐ భర్త అనుమానాస్పద మృతి

ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు వారి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. తీవ్రంగా గాయపడిన మరో 10 ప్రయాణికులను చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. మృతులందరినీ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని