J&K: భాజపా సర్పంచి కాల్చివేత!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నాయి. కశ్మీర్‌లోని స్థానిక సర్పంచులపై వరుస కాల్పులకు పాల్పడుతున్నారు.

Published : 06 Aug 2020 15:22 IST

గత రెండురోజుల్లో ఇద్దరు సర్పంచులపై కాల్పులు

శ్రీనగర్‌‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నాయి. కశ్మీర్‌లోని స్థానిక సర్పంచులపై వరుస కాల్పులకు పాల్పడుతున్నారు. తాజాగా కుల్గాం జిల్లాలోని వెస్సూ ప్రాంతానికి చెందిన సర్పంచి సాజద్‌ అహ్మద్‌ ఖాండేపై ఆయన ఇంటి సమీపంలో కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలపాలైన సాజద్‌ను వెంటనే అనంత్‌నాగ్‌లోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొద్దిసేపటికే సాజద్‌ మృతి చెందినట్లు జీఎంసీ వైద్యులు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే, గడిచిన రెండు రోజుల్లోనే కుల్గాంలో ఇద్దరు సర్పంచులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నెల నాలుగో తేదీన ఆరీఫ్‌ అహ్మద్‌ అనే సర్పంచి‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతను తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఇద్దరు సర్పంచులు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలే. అయితే, గత కొంతకాలంగా కుల్గాం, బందీపూర్‌లలో కాంగ్రెస్‌, భాజపా నాయకులపై ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని