కారుతో పోలీసును ఈడ్చుకెళ్లి...

తనిఖీల్లో భాగంగా కారును ఆపడానికి ప్రయత్నించిన ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ను అదే వాహనంపై ఈడ్చుకు వెళ్లిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ సక్కర్దరా ప్రాంతంలో ఆదివారం ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Published : 01 Dec 2020 01:32 IST


 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తనిఖీల్లో భాగంగా కారును ఆపడానికి ప్రయత్నించిన ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ను అదే వాహనంపై ఈడ్చుకు వెళ్లిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ సక్కర్దరా ప్రాంతంలో ఆదివారం ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విధుల్లో ఉన్న ఓ పోలీసు అటుగా వచ్చిన కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. వాహనదారుడు కారును ఆపలేదు. అడ్డుగా వెళ్లిన పోలీసును ఆ కారు ఢీకొనటంతో దాని బానెట్‌ మీద పడ్డాడు. అయినప్పటికీ చోదకుడు కారును ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన ద్విచక్రవాహనాలను కూడా ఢీకొన్నాడు. ఈ ఘటనకు కారణమైన ఆ వాహన దారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని