TSPSC: ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)(TSPSC)లో పేపర్ల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ తెలిపారు.

Updated : 14 Mar 2023 15:01 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)(TSPSC)లో పేపర్ల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ తెలిపారు. కేసు దర్యాప్తుపై విక్రమ్‌సింగ్‌ వివరణ ఇస్తూ.. ‘‘గ్రూప్‌-1 (Group-1) పేపర్‌ లీక్‌ అయినట్లు మా దృష్టికి రాలేదు. ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఏడుగురి మహిళల నగ్న చిత్రాలను గుర్తించాం. సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాం. ప్రస్తుతం ఏఈ పేపర్‌ లీకేజీకి సంబంధించిన కేసు దర్యాప్తు మాత్రమే కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్టు చేశాం. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నాం’’ అని విక్రమ్‌సింగ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని