హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకం

రంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని రాంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ అర్బన్‌ జిల్లా హన్మకొండ రాంనగర్‌కు చెందిన షాహిద్‌ స్థానికంగా..

Published : 11 Jan 2020 00:42 IST

వరంగల్‌ క్రైం: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని రాంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ అర్బన్‌ జిల్లా హన్మకొండ రాంనగర్‌కు చెందిన షాహిద్‌ స్థానికంగా ఉన్న ఓ మటన్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. లష్కర్‌సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని హారతి(26)తో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాంనగర్‌లోని షాహిద్ అద్దెగదికి యువతి వెళ్లింది. అక్కడ వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో నిందితుడు హారతిపై కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఆమె గొంతు కోసి అక్కడనుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే చనిపోయింది. యువతిపై దాడి అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

రాంనగర్‌లోని ఘటనాస్థలిని వరంగల్ సీపీ రవీందర్‌ పరిశీలించారు. అదుపులోకి తీసుకున్న షాహిద్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు కమిషనర్‌ వెల్లడించారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వెళ్తున్నానని చెప్పి కానరానిలోకాలకు వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.

యువతి కుటుంబానికి న్యాయం చేస్తాం: ఎర్రబెల్లి

హత్య జరిగిన ఘటనా స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. యువతి కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని