
Updated : 13 Mar 2020 11:58 IST
కడపలో రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం
సిద్దవటం: కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో-లారీ ఢీ కొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్ బండి ఆది సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి.బాధితులు కర్నూలు జిల్లా బాలంపురం నుంచి స్కార్పియోలో తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను సుల్తాన్ (28), హరినాథ్‌రెడ్డి(36), నందకిశోర్‌రెడ్డి(6), పార్వతి(30), శంకర్‌నారాయణరెడ్డి(55), జయమ్మ(55), కృష్ణ కిశోర్‌రెడ్డి (29)గా గుర్తించారు. వీరితోపాటు మరో బాలిక సైతం గాయపడినట్లు సమాచారం.
Advertisement
Tags :