Software Engineer: మహిళా టెకీతో అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

పక్క సీటులో కూర్చున్న తిరుపతికి చెందిన మహిళా టెకీ(35)ని తాకి, అసభ్యంగా ప్రవర్తించిన తిరుచికి చెందిన రంగనాథ్‌ (50) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 09 Nov 2023 07:30 IST

బెంగళూరు(గ్రామీణం), న్యూస్‌టుడే: పక్క సీటులో కూర్చున్న తిరుపతికి చెందిన మహిళా టెకీ(35)ని తాకి, అసభ్యంగా ప్రవర్తించిన తిరుచికి చెందిన రంగనాథ్‌ (50) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బెంగళూరుకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో మహిళ పక్క సీట్లోనే నిందితుడు కూర్చున్నాడు. నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్లు గుర్తించి, ఆమె మేల్కొంది. వెంటనే విమానయాన సిబ్బందికి తెలిపింది. బెంగళూరుకు విమానం చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో రంగనాథ్‌ను మంగళవారం అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని