కోటా హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. 8 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని కోటాలో ఆదివారం ఉదయం ఓ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హాస్టల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లో షాట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Published : 15 Apr 2024 04:45 IST

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో ఆదివారం ఉదయం ఓ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హాస్టల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లో షాట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు నిమిషాల్లో హాస్టల్‌లోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు తప్పించుకోవడానికి పరుగులు పెట్టారు. కొందరు మొదటి, రెండో అంతస్తులోని బాల్కనీ నుంచి దూకడంతో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన విద్యార్థులను రక్షించారు. అగ్నిమాపక యంత్రాలతో 3గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఆరుగురు విద్యార్థులకు కాలిన గాయాలవ్వగా, మొదటి అంతస్తు నుంచి దూకిన ఓ విద్యార్థి కాలుకు గాయమైనట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని