TS news: హైదరాబాద్‌ వైద్యుడికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు చిక్కుకున్నారు. ఔషధాల్లో కలిపే ఆయిల్‌ను విక్రయిస్తామంటూ మురళీ మోహన్‌రావు అనే వైద్యుడిని సైబర్‌

Updated : 06 Aug 2021 05:26 IST

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు చిక్కుకున్నారు. ఔషధాల్లో కలిపే ఆయిల్‌ను విక్రయిస్తామంటూ మురళీ మోహన్‌రావు అనే వైద్యుడిని సైబర్‌ కేటుగాళ్లు మోసం చేశారు. అమెరికాలో ఆయిల్‌ వ్యాపారం చేస్తున్నామని నమ్మించి విడతల వారీగా డబ్బులు వసూలు చేసుకున్నారు. ఇలా వైద్యుడు రూ.11 కోట్లను సైబర్‌ నేరగాళ్ల అకౌంట్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత వాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని