
ఉగ్ర ఘాతుకం.. 19 మంది మృతి!
కాబూల్: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కాబూల్‌లోని ఓ పెద్ద విశ్వవిద్యాలయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇరానియన్ బుక్ ఫెయర్ ప్రారంభం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య గంటల తరబడి కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు గుర్తించారు. బుక్ ఫెయిర్ ప్రారంభించేందుకు కొందరు అధికారులు వస్తుండగా ఈ కాల్పులు ప్రారంభమయ్యాయని చెప్పారు. కాల్పుల సమయంలో వందలాది మంది యూనివర్సిటీ గేట్లు దూకి పరుగులు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న అఫ్గన్ భద్రతా దళాలు రంగంలోకి దిగి యూనివర్సిటీని చుట్టుముట్టి.. రోడ్లు మూసివేసినట్టు పేర్కొన్నారు.
కాబూల్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అయితే, కాబూల్‌లో కొన్ని విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. గత వారంలో కాబూల్‌లోని ఓ విద్యా సంస్థ వద్ద ఐసిస్ ఆత్మాహుతి దాడికి పాల్పడగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Business News
Tax on Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్.. దిగుమతి సుంకం పెంపు!
-
Business News
Tax on petrol diesel exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను
-
Crime News
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
-
Sports News
Jasprit Bumrah: అది అర్థమయ్యేసరికి బుమ్రాకు సమయం పట్టింది: సంజన
-
India News
Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!