Andhra News: బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వాలంటీర్‌ భర్త

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో మైనర్‌ బాలికను వార్డు వాలంటీర్‌ భర్త లైంగికంగా వేధిస్తున్నాడు. ఇంటర్‌ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు.

Updated : 24 Apr 2022 16:38 IST

తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో మైనర్‌ బాలికను వార్డు వాలంటీర్‌ భర్త లైంగికంగా వేధించాడు. ఇంటర్‌ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. శనివారం ఈ ఘటన జరగ్గా.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనను వేధించిన వాలంటీర్‌ భర్తకు శిక్ష పడాల్సిందేనని బాధితురాలు డిమాండ్‌ చేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన బాలిక (17) తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం తిరువూరు ఎన్‌ఎస్‌పీ కాలనీలో కొన్నేళ్ల క్రితం స్థిరపడ్డారు. బాలిక ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. వరుసకు మామ అయిన వాలంటీర్‌ భర్త సురేష్‌ గత కొంత కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో బాలిక స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. ఇది గమనించిన బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వీడియోలను మొబైల్‌ నుంచి డిలీట్‌ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్సై సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి.. అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్‌ భర్త సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని