Andhra News: పప్పుల చిట్టీ పేరిట రూ.4 కోట్లకు మహిళ టోకరా

పప్పుల చిట్టీ పేరుతో ఓ మహిళ సుమారు రూ.4కోట్లకు టోకరా వేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌ పేటలో చోటుచేసుకుంది. 

Updated : 26 Dec 2022 20:50 IST

గుర్ల: పప్పుల చిట్టీ పేరుతో ఓ మహిళ సుమారు రూ.4కోట్లకు టోకరా వేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌ పేటలో చోటుచేసుకుంది. పతివాడ శ్రీలేఖ  అనే వాలంటీర్‌ ఈ మోసానికి పాల్పడ్డారు. నెలకు రూ.300 చొప్పున ఏడాదికి రూ.3,600 చెల్లించాలని.. దీనికి బియ్యం, పప్పులు, నూనె తదితర 24 రకాల వస్తువుల్ని ఇస్తామని నమ్మించారు. దీంతో సుమారు 11వేల మంది చేరారు.

కొండకరకాం గ్రామంలోని శ్రీలేఖ మేనమామ కుమారుడు మజ్జి అప్పలరాజు కూడా ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు. పలువురు ఏజెంట్లను ఏర్పాటు చేసి మరీ చీట్టీలను కట్టించారు. కిస్మస్‌ సందర్భంగా పలువురు క్రిస్టియన్లు తమకు పండగ సామగ్రి ఇవ్వాల్సిందిగా కోరారు. రేపు.. మాపు అంటూ తప్పించుకొని తిరిగిన నిర్వాహకులు ఒత్తిడి పెరగడంతో పరారయ్యారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు ఆమె ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఫలితం లేదని తెలియడంతో అనంతరం పోలీసులను ఆశ్రయించారు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని