logo

వాగు దాటి వైద్యం అందించి.!

ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది చూడాలని ఏజెన్సీ జిల్లా ఉపవైద్యాధికారి కుడ్మెత మనోహర్‌ సూచించారు. కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలతో ఉట్నూరు మండలం

Published : 12 Aug 2022 02:40 IST

తాడు సహాయంతో వాగు దాటుతున్న ఏజెన్సీ జిల్లా ఉపవైద్యాధికారి కుడ్మెత మనోహర్‌, వైద్య సిబ్బంది

ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది చూడాలని ఏజెన్సీ జిల్లా ఉపవైద్యాధికారి కుడ్మెత మనోహర్‌ సూచించారు. కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలతో ఉట్నూరు మండలం జెండాగూడకు వెళ్లే మార్గంలో చెరువుగూడ సమీపాన ఉన్న వాగు నీటితో ప్రవహిస్తోంది. గురువారం ఆయన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయ్‌కుమార్‌, దంతనపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి అనురాధ వైద్య సిబ్బందితో కలిసి జెండాగూడకు వెళ్లే దారిలో ఉన్న వాగును తాడు సహాయంతో దాటారు. అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులిచ్చారు. వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం మూడు రోజుల కిందట మృతి చెందిన కేజీబీవీ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. పీవీటీజీ ఏపీఓ భాస్కర్‌ వైద్య సిబ్బంది శ్రీనివాస్‌, నూర్‌సింగ్‌, గణేశ్‌ కుమారి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని