logo

చెరువుల పండగను ఘనంగా నిర్వహించాలి

చెరువుల పండగను ఊరూరా ఘనంగా నిర్వహించాలని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో ఈ నెల 7న నిర్వహించే సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

Published : 04 Jun 2023 03:07 IST

మాట్లాడుతున్న పాలనాధికారి రాహుల్‌రాజ్‌, చిత్రంలో   శిక్షణ సహాయ పాలనాధికారి శ్రీజ

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: చెరువుల పండగను ఊరూరా ఘనంగా నిర్వహించాలని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో ఈ నెల 7న నిర్వహించే సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందితో సభ నిర్వహించాలని సూచించారు. చెరువుల వద్ద సాయంత్రం 5 గంటలకు పండగ జరపాలన్నారు. గ్రామాల నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్యకారుల వలలతో ఊరేగింపుగా తరలివెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు గట్ల వద్ద పండగ వాతావరణం కనిపించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలసి అధికారులు సహపంక్తి భోజనాలు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిక్షణ సహాయ పాలనాధికారి డా.పి.శ్రీజ, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్‌, నీటిపారుదలశాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు