logo

ఓటు హక్కుపై అవగాహన

జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి కళాకారుల బృందం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Published : 20 Apr 2024 13:21 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం : జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి కళాకారుల బృందం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వినాయక కూడలి వద్ద పాటలు పాడుతూ ఓటు హక్కు  గురించి వివరించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కొత్తగా నమోదైన ఓటర్లు, అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా  ఓటు హక్కును వినియోగించుకోవాలని పాటల రూపంలో సూచించారు.

అదేవిధంగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు నీరు తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు గుంజాల రమేష్, గట్టు వెంకట్రావు, మురళి, ఆశిష్, నరసమ్మ, నగేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని