logo

ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు

వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎస్‌.శాంతారామ్‌,

Published : 24 Apr 2024 07:16 IST

మంచిర్యాల జిల్లా పాలనాధికారి సంతోష్‌

సదస్సులో మాట్లాడుతున్న పాలనాధికారి బి.సంతోష్‌

ఏసీసీ, న్యూస్‌టుడే: వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎస్‌.శాంతారామ్‌, అదనపు పాలనాధికారి బి.రాహుల్‌, మంచిర్యాల, కుమురంభీం, నిర్మల్‌ జిల్లాల అటవీశాఖ అధికారులతో కలిసి వన్యప్రాణులు, మానవుల సంరక్షణపై నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్యప్రాణులతో మానవ జీవితాల సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. ఏనుగుల ఆవాసాలను గుర్తించి జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆక్రమణకు గురైన అటవీప్రాంతాలను స్వాధీనం చేసుకొని వన్యప్రాణులకు తాగునీరు. ఆహారానికి పండ్ల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన్యప్రాణులు జనవాసాల్లోకి వచ్చినపుడు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అటవీప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ఉన్న నివాసాలను అక్కడి నుంచి తరలించేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు వన్యప్రాణుల కదలికలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ల్యాండ్‌ స్కేప్‌ జాతీయ సమన్వయకర్త భూమినాథన్‌, ఏనుగుల ప్రత్యేక కన్జర్వేషన్‌ నవనీథన్‌, కుల్‌దీప్‌రాయ్‌, పోలీసులు, అటవీ, రెవెన్యూ, విద్యుత్తు, పంచాయతీ, పశుసంవర్థక, మండల పరిషత్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు