logo

వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు.

Published : 29 Mar 2024 02:50 IST

మాట్లాడుతున్న శిరీషాదేవి, పక్కన పరిశీలకులు శ్రీనివాస్‌
రంపచోడవరం, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్‌తో కలిసి శిరీషాదేవి విలేకరులతో మాట్లాడారు. అయిదేళ్ల కాలంలో ఒక్క ఇంటిని కూడా వైకాపా నిర్మించలేదన్నారు. అధికారంలోకి వస్తే 2 లక్షల 30వేల ఉద్యోగాలను ఇస్తామని చెప్పిన జగన్‌ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దీంతో ఎంతోమంది నిరుద్యోగ యువత వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి  ప్రతి నెల జీతాలు, పింఛన్లు అందని పరిస్థితులు దాపురించాయన్నారు. అంగన్‌వాడీల నుంచి ఆశ, యానిమేటర్లకు కనీస వేతనాలను చెల్లించడంలో విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు అధికారం చేపడితేనే సంక్షేమ పాలన వస్తుందని అన్నారు. తెదేపా నాయకులు అడబాల బాపిరాజు, పెంటపాటి అనంతమోహన్‌, భాజపా నాయకులు కుండ్ల కృష్ణారెడ్డి, తుర్రం బాబూరావుదొర, జనసేన నాయకులు రాగాల సురేష్‌, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని