logo

అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై కేసులా?

పోలీసులు వివక్షను వీడి చట్టపరిధికి లోబడి అందరికీ ఒకే న్యాయం అమలు చేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర కోరారు.

Published : 29 Nov 2022 05:21 IST

ఏఎస్పీకి వినతిపత్రం ఇస్తున్న రవీంద్ర, తెదేపా నాయకులు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: పోలీసులు వివక్షను వీడి చట్టపరిధికి లోబడి అందరికీ ఒకే న్యాయం అమలు చేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర కోరారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌లపై దుర్భాషలాడిన రాప్తాడు నియోజకవర్గ వైకాపా నాయకుడు తోపదుర్తి చందుపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా ఏఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులుకు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్రతో పాటు పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), బాబాప్రసాద్‌, వీరంకి గురుమూర్తి, తదితరులు మాట్లాడుతూ వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఎటుపోతోందో అర్థంకాని దుస్థితి దాపురించిందన్నారు. హత్యా రాజకీయాలకు చేస్తున్న వారికి అధికారపార్టీ నాయకుల ఆదేశాలతో మద్దతు పలకడం బాధాకరమన్నారు. నిందితులపై సాధారణ కేసులు, బాధితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం హేయమన్నారు.  జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి పరిస్థితులే పునరావృతం అయితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఏఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు మరకాని సమతాకీర్తి, సులేమాన్‌, నారాయణప్రసాద్‌, కుంచె నాని, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని