వ్యవసాయ బ్యాంకు మాజీ ఛైర్మన్‌పై కేసు
పెనమలూరు వ్యవసాయ బ్యాంకు మాజీ ఛైర్మన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కంచర్ల సుధీర్ పెనమలూరు నివాసి.
పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు వ్యవసాయ బ్యాంకు మాజీ ఛైర్మన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కంచర్ల సుధీర్ పెనమలూరు నివాసి. అతనికి అదే గ్రామానికి చెందిన వ్యవసాయ బ్యాంకు మాజీ ఛైర్మన్ ముప్పాళ్ల బదరీనారాయణతో వివాదాలున్నాయి. ఈనెల 17వ తేదీన సుధీర్ గ్రామంలోని పాత రైస్ మిల్లు వద్ద ఉండగా.. బదరీనారాయణ వచ్చి తనపై అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నావని, పసుపు పంట బీమా రూ.10 లక్షల వ్యవహారంలో తనను అప్రతిష్ఠపాలు చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న నిన్ను, సర్పంచి లింగాల భాస్కర్‌ల వ్యవహారాలను త్వరలో తేలుస్తానని అనడంతో పాటు అంతుచూస్తానంటూ బెదిరించారు. దీంతో భయాందోళనలకు గురైన సుధీర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు బదరీనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్
-
Sports News
ICC Rankings: కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
-
India News
UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులెన్నంటే?
-
Politics News
Sajjala: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాయిస్ రికార్డు అయితే, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు: సజ్జల
-
Politics News
Chandrababu: వైకాపా 31 మంది ఎంపీలు ఏం సాధించారు?: బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు
-
Sports News
Sports Budget: క్రీడల బడ్జెట్.. పెరిగింది కాస్తే కానీ.. ఇదే అత్యధికం!