logo

అనుమతులు లేకుండా బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వహణ

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్‌లో గల ఎమ్‌ఎస్‌ఆర్‌ బ్లడ్‌ బ్యాంకుపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు.

Published : 07 Feb 2023 03:26 IST

కేసులు నమోదు చేసిన ఔషధ నియంత్రణ శాఖ

తనిఖీల్లో పాల్గొన్న అధికారులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ పట్టణం ఏలూరు రోడ్‌లో గల ఎమ్‌ఎస్‌ఆర్‌ బ్లడ్‌ బ్యాంకుపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. గత నెల 30న బ్లడ్‌ బ్యాంకు నిర్వహణకు అనుమతులు రద్దు అయినప్పటికీ  కార్యకాలాపాలు ఆగలేదని తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నామని గుడివాడ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ జె.బాలు తెలిపారు. రక్త నమూనాల సేరకణ, రక్త గ్రూపు, క్రాస్‌ మ్యాచింగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. 12 రక్తం ప్యాకెట్లు, 3 ఖాళీ ప్యాకెట్లను సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. మరికొంత సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మచిలీపట్నం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.


స్వాధీనం చేసుకున్న రక్తం ప్యాకెట్‌

సీజ్‌ చేసిన సామగ్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని