logo

భారతీయ వైద్య విధానాలను ప్రోత్సహించాలి

ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు అల్లోపతి వైద్యాన్ని వీలైనంత వరకూ తగ్గించి ఎలాంటి వ్యతిరేక ప్రభావం లేని సంప్రదాయ భారతీయ వైద్య విధానాలను ప్రోత్సహించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 03:26 IST

మాట్లాడుతున్న ఎం.టి.కృష్ణబాబు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు అల్లోపతి వైద్యాన్ని వీలైనంత వరకూ తగ్గించి ఎలాంటి వ్యతిరేక ప్రభావం లేని సంప్రదాయ భారతీయ వైద్య విధానాలను ప్రోత్సహించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు పేర్కొన్నారు. డాక్టర్‌ గురురాజు హోమియో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి వజ్రోత్సవాలు సోమవారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా కృష్ణబాబు మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న కళాశాలను వచ్చే ఫిబ్రవరిలోగా పూర్తిచేయడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆసుపత్రి, వైద్య కళాశాలలోని ఖాళీ ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హోమియో వైద్య విద్యార్థులకు కూడా ప్రాక్టీసు కోసం కొన్ని పడకలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా ఏపీ వైద్యవిధాన పరిషత్తు ఉన్నతాధికారులతో మాట్లాడి కావాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్‌ గురురాజు ప్రభుత్వ హోమియో ఆసుపత్రి ఎదురుగా ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని విద్యార్థులు కోరగా సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కరిస్తామన్నారు. కళాశాల, ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్‌ గురురాజు మనుమడు డాక్టర్‌ ఎం.జయరామ్‌ను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గీతాబాయి, కళాశాలలో విద్య పూర్తి చేసన పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని